ఖర్చు లేదు కలలు కనరా మహ దర్జాగా
కన్న కలని గాలి కొదలకావారా గా!!
కృషీ జలాలు తాగించు,కష్టాన్నం తినిపించు
స్వేదమే తన వేదమని విద్యను బోధించు
ఓటమనే శత్రువు తో స్నేహం నేర్పించు
సహనమనే హితుడితో సహగమనం చేయించు
కాలచక్ర భ్రమణంలో ఈ గుణాలు గల కలలే
నిలువెత్తు నిజాలుగా,నీ శ్రమకు నిదర్శనాలుగా
మనిషివైన నీ జన్మకు నిర్వచనం చెబుతాయి.
కలలంటే కనులు మూస్తే కనిపించే కథలు కావు,
కసి తో రగిలే యదలో కలిగే విస్ఫోటనాలు.
కలలంటే కనులు తెరవగానే కరిగేవి కావు,
కరిగే కాలానికి మన కానుక-నీరాజనాలు,
కలలంటే రూపురేఖల్లేని వస్తువులు కావు,
కనిపించని మన శక్తిని కనిపెట్టే సాధనాలు!
శ్రీరామ్ సాంజి
No comments:
Post a Comment